చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గోల్ మాల్... చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగి!

  • బ్లడ్ బ్యాంక్ లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఉద్యోగి 
  • నాలుగేళ్లుగా జ్యూస్, పండ్ల బిల్లును పెంచి నొక్కేస్తున్న వైనం 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వామినాయుడు
హైదరాబాదులోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లోని ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు పక్కనే ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఒక ఉద్యోగి సుదీర్ఘ కాలంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. దాతలు రక్తదానం చేసిన తరువాత ఇచ్చే జ్యూస్‌, పండ్లను ఆయన సమకూర్చుతున్నాడు. గత నాలుగేళ్లుగా ఆయన ఈ జ్యూస్, పండ్ల బిల్లును పెంచి చూపిస్తున్నాడు. సంస్థకు అధిక బిల్లులు వేసి, డబ్బులు నొక్కేస్తున్నట్టు తేలింది. దీనిని పసిగట్టిన నిర్వాహకుడు స్వామినాయుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
Go Back to Shorts
Chiranjeevi
blood bank
Hyderabad

More Telugu News